ప్రజాశక్తి - వేపాడ : సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే ఇంటికే పరిమితమవుతారని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హెచ్చరించారు. మండలంలోని జాకేరు గ్రామంలో గురువారం ఎపికి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన సచివాలయం వద్దకు వచ్చేసరికి సిబ్బంది పూర్తిగా లేకపో వడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఇస్తే విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిమ్మల్ని ఏం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇకపై ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సంక్షేమ డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు, పంచాయతీ విస్తరణ అధికారి ఉమా, వైసిపి మండల అధ్యక్షుడు జగ్గుబాబు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షు డు ఎన్ వెంకటరావు, నాయకులు ఎం సత్యనా రాయణ, ఎఎంసి చైర్పర్సన్ కస్తూరి, టీవీ రమణ, బుద్ధ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : రాష్ట్రాభివృద్ధికి మరోసారి జగన్మోహన్రెడ్డిని సిఎంను చేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు. గురువారం నగర పంచాయతీ పరిధి 8,9వార్డు, సచివాలయం-4లో పలు రకాల సంక్షేమ పథకాలకు సంబంధించిన డిజిటల్ బోర్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే' సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు అందవరపు సూరి బాబు, నగర పంచాయతీ చైర్ పర్సన్ బంగారు సరోజినీ, శంకరరావు, వైస్ చైర్ పర్సన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, వైసిపి పట్టణ అద్యక్షుడు చిక్కాల సాంబశివరావు, కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్, బూర సుజాత, మొయిద శ్రీను, చిక్కాల సంతోష్, డైరెక్టర్ పాడ్రంకి మహాలక్ష్మి, కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
డెంకాడ : మండంలోని పినతాడివాడలో జగనే మళ్లీ రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమం గురువారం సచివాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 99శాతం నెరవేర్చారని కుటుంబంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరందని చెప్పారు. అనంతరం సచివాలయం వద్ద డిజిటల్ బోర్డును ప్రారంభించి వైసిపి జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి ఆదిలక్ష్మి, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, సర్పంచ్ లంక లక్ష్మణరావు, ఎంపిటిసి విజినగిరి అచ్చింనాయుడు, సర్పంచులు కోరాడు కనకరాజు, అట్టాడ శివ కృష్ణ, పలు శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.