Aug 19,2023 00:02
డిఇఒకు వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉపాధ్యాయుల జీతాలు, పని సర్దుబాటు, పని భారం సమస్యలపై శుక్రవారం బాపట్ల డిఇఓ కార్యాలయం వద్ద ఫ్యాప్టో నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి రామారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు జరిగి మూడు నెలలు కాకుండానే మరలా పని సర్దుబాటు చేయడం సరికాదని అన్నారు. సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీవో 117 పేరుతో రేషనలైజేషన్‌ జరిగి మూడు నెలలు పూర్తి కాకుండానే మరలా రేషనలైజేషన్‌ చేయటం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ బీ శ్రీనివాస్‌, సెక్రెటరీ జనరల్‌ సురేష్‌, సీనియర్‌ నాయకులు చాంద్‌బాషా, జిల్లా సెక్రెటరీ శ్రీనివాసరావు, నాయకులు విజరుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు కలెక్టరేట్‌: జిల్లాలో పని సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ డిఇఒ సుబ్బారావుకు ఫ్యాప్టో జిల్లా నేతలు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బదిలీలు జరిగి 3 నెలలు కాకుండానే మరలా ఉపాధ్యా యుల పని సర్దుబాటు చేయడం పట్ల రాష్ట్ర ఫ్యాప్టో తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 2023 జూన్‌లో బదిలీలు, రేషనలైజేషన్‌, ప్రమోషన్స్‌ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించినట్లు తెలిపారు. అందులో బదిలీ అయిన 10వేల మందికి పైగా ఉపాధ్యాయులకు 3 నెలలు కావస్తున్నా జీతాలు అందలేదన్నారు. బదిలీలలో రిలీవర్‌ రాలేదని, సుమారు 1000 మంది ఉపాధ్యాయులు ఇప్పటి కీ రిలీవ్‌ కాకుండా అదే పాఠశాలలో కొనసాగు తున్నారన్నారు. ప్రస్తుతం వీరిని రిలీవ్‌ చేసినా మరల అదే పాఠశాలలో విధులు నిర్వహించా లని ఉత్తర్వులు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నామ న్నారు. డిఇఒను కలిసిన వారిలో ఫ్యాప్టో జిల్లా నాయకులు ఎస్‌ రవి, బి రఘుబాబు, పి సువర్ణ బాబు, శేషారావు, వై వెంకట్రావు ఉన్నారు.