ప్రజాశక్తి -అనకాపల్లి : తీవ్రమైన పని ఒత్తిడి వల్ల విఆర్‌ఒలు అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిపై పని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం తహశీల్దార్ శ్రీరామమూర్తికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు నిర్ణీత సమయం కేటాయించాలన్నారు. రెవెన్యూ విధులతో పాటు జగనన్న కాలనీ పనులతో పాటు ఇకెవైసి, ఇతర ధ్రువపత్రాల మంజూరీ, ఈ క్రాప్ నమోదు, ఓటర్ల నమోదు, ఓటరు దరఖాస్తుల పరిశీలన వంటి అనేక పనులు ఒకేసారి అధికారులు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. విఆర్‌ఒలకు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో పనులు అప్పగించాలని, ఆదివారం కుటుంబంతో గడిపే వీలుగా పూర్తి సెలవు ఇవ్వాలని ోరారు. విఆర్‌ఒల సంఘం నాయకులు పివి అప్పారావు, అనంతరామయ్య, గణేష్, శేషగిరిరావు పాల్గొన్నారు.










