జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయినులు
ప్రజాశక్తి - నరసరావుపేట : తమను విధుల నుండి తొలగించొద్దని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కెజిబివి) కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయినులు కోరారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌ను కలెక్టరేట్‌లో 30 మంది ఉపాధ్యాయినులు గురువారం కలిసి విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధ్యాయులు, వార్డెన్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అయితే ఇప్పటికే పని చేస్తున్న తమను కొనసాగించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సుధారాణి, అశోకరాణి, సుజాత, అనిత, అనంతలక్ష్మి, కోటేశ్వరమ్మ ఉన్నారు.










