నగరం : ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వేరుశనగ, మొక్కజొన్న పంటలను బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్ బుధవారం పరిశీలించారు. తొలుత మండల పరిధిలోని ఈదుపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటను పరిశీలించారు. నగరం, ధూళిపూడి, తోటపల్లి, పూడివాడ రెవెన్యూ గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ అధిక వర్షాలకు దెబ్బతిని క్రాప్ నమోదు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి నష్టం జరిగిన ప్రతి రైతు పేరు నమోదు చేయాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రేపల్లె ఎడిఎ సయ్యద్ అక్తార్ హుస్సేన్ మాట్లాడుతూ నగరం మండలంలో పంట నష్ట పరిహార నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు మార్టూరు ఎడిఎ శ్రీనివాసరావు, కర్లపాలెం ఎఒ సుమంత్ కుమార్ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వేమూరు రమేష్ బాబు , ఎఇఒ నాగ శ్రీనివాస్, గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్మయి, వంశీకష్ణ , గంగాభవాని, కవిత, విఆర్‌ఒ చిన్నం సుధాకర్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.










