Oct 12,2023 21:21

పంటలపై జంట ఏనుగుల దాడి
ప్రజాశక్తి - రామకుప్పం:
మండల అటవీ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ ఏనుగుల దాడులు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజులుగా ఎస్‌.గొల్లపల్లి గ్రామ పరిసరాల్లో జంట ఏనుగులు సోమశేఖర్‌, కష్ణప్ప, బీవీ సుబ్రమణ్యం అనే రైతులకు చెందిన వరి పంటను, అరటి తోటను తిన్నంత తిని తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల దాడులు కొనసాగుతున్నా వాటి నివారణకు చర్యలు చేపట్టకుంగా ప్రభుత్వం పంట నష్టపరిహారం నామమాత్రంగా చెల్లిస్తున్నారని బాధిత రైతు కుటుంబాలు వాపోతున్నారు. ఏనుగులు అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని, ప్రభుత్వం స్పందించి తగిన పంట నష్ట పరిహారంతో పాటు అటవీ చుట్టూ పూర్తిస్థాయిలో కంచే వేసి అడవి జంతువులు గ్రామాల వైపు రాని విధంగా చూడాలి గ్రామస్తులు కోరుతున్నారు.