Nov 01,2023 23:57

కరదీపికలతో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - కనిగిరి : పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని చీర్లదిన్నె, వంగపాడు రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతు ఉత్పత్తి దారుల సంఘాల రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యపద్ధతులపై బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి కస్తూరి రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో అమలు చేస్తున్న పథకాలు రైతులకు అందేలా కృషి చేయాలన్నారు. స్థానిక ఎఒ జోత్స్నదేవి మాట్లాడుతూ ఎఫ్‌బిజి గ్రూప్స్‌, వ్యవసాయ శాఖ అవలంభిస్తున్న పథకాల గురించి రైతులకు వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ అధికారి శైలజ రాణి మాట్లాడుతూ రైతు వాట్సాప్‌ గ్రూప్‌లు, ఎఫ్‌ జి గ్రూపుల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. డిఆర్‌సి ఎఒ వీరగంధం వెంకట శేషమ్మ మాట్లాడుతూ వరి, కంది, మినుము, శనగ, అలసంద, మిరప పంటలలో ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణ గురించి వివించారు. అదేవిధంగా విత్తనం విత్తక ముందు నుంచి కోత వరకూ చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఎఫ్‌బిఒసిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎఫ్‌పిజి గ్రూపుల బలోపేతం, గ్రూపు సభ్యుల భాద్యతలు, గ్రూపు నిర్వాహణ గురించి వివరించారు. అనంతరం సాంకేతిక సమాచార కరదీపికలను రైతులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చీర్లదిన్నె ఎంపిటిసి అట్లా రామచంద్రా రెడ్డి, రైతు సంఘం నాయకుడు పి సిద్ధారెడ్డి, జమ్మలమడక సర్పంచి పాశం కొండయ్య, విఎఎలు హబీబ్‌ జిలాని , అసిఫా బేగం తదితరులు పాల్గొన్నారు.