Aug 21,2023 18:25

పంట కో త ప్రయోగంపై శిక్షణ ఇస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు పంటల భీమా, రాష్ట్ర స్తూల ఉత్పత్తి గణంకాలకు పంట కోత ప్రయోగాలు ఎంతో కీలకమని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌ కుమార్‌ తెలిపారు. తోటపల్లిగూడూరు మండల డాక్టర్‌ వైఎస్సార్‌ క్రాంతిపథం కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం వ్యవసాయ సహాయకులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ శాఖ అధికారి శిరీష రాణి పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఏడిఎ రాజ్‌ కుమార్‌, మండల గణాంకాధికారి రాంప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ పంటకోత ప్రయోగాలకు క్షేత్ర ఎంపిక, ప్రయోగం చేయు పద్దతి, మొత్తం విధానాన్ని ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా అప్లోడ్‌ చేయాలని సూచించారు. పంటల భీమా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి లెక్కలకు కీలకమైన పంటకోత ప్రయోగాలు శ్రద్దగా నిర్వహించాలని రాజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారిణి శిరీషా రాణి మాట్లాడుతూ ప్రయోగాల నిర్వహణ సక్రమంగా జరగాలని తెలిపారు. ప్రయోగాల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయ డం జరుగుతుందని ఆమె చెప్పారు. ఎఎస్‌ఓ, ఏఇవో, విఏఎ, విహెచ్‌ఏ ఉన్నారు.