Aug 24,2022 23:11

పంట పొలంలో రైతులతో మాట్లాడుతున్న ఎడిఎ విజయప్రసాద్‌

ప్రజాశక్తి -భీమునిపట్నం       ఈ-పంటలో సాగు వివరాల నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్డేపల్లి విజయప్రసాద్‌ సూచించారు. బుధవారం కాపులుప్పాడలో వరి పంటపొలంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి పంట నమోదుపై అవగాహన కల్పించారు. ఈ-క్రాప్‌ నమోదు ద్వారా రైతులు పంట నష్టపోతే బీమా సదుపాయం వర్తిస్తుందని, రైతు భరోసా, పంటకు కనీస మద్దతు ధర, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఇతరత్రా ఇన్‌పుట్స్‌పై రాయితీ వంటి అనేక సదుపాయాలు వరిస్తాయన్నారు.
ఎరువుల నిల్వలను ఎడిఎ పరిశీలన
జివిఎంసి నాలుగో వార్డు కాపులుప్పాడ రైతు భరోసాకేంద్రాన్ని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్డేపల్లి విజయప్రసాద్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల పంపిణీ, తదితర వివరాలను సిిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు.