Oct 11,2023 00:12

పంట పొలాలను పరిశీలిస్తున్న జెసి విశ్వనాథన్‌

ప్రజాశక్తి -ఆనందపురం : ఖరీఫ్‌ పంట నమోదు తనిఖీలో భాగంగా గొట్టిపల్లి గ్రామంలోని వరి పొలాలను జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ మంగళవారం సందర్శించారు. రైతులు వేసిన పంట వివరాలు, రకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, తహశీల్దారు లోకవరపు రామారావు, మండల వ్యవసాయ అధికారి సిహెచ్‌.సంధ్య రత్న ప్రభ, విఎఎలు, రైతులు పాల్గొన్నారు.