Jul 31,2023 23:49

తహశీల్దార్‌కి వినతిపత్రసి ఇస్తున్న సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ

దుగ్గిరాల: అకాల వర్షాల కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీరు రోజులు గడుస్తున్నా బయటకు పోయే అవకాశం లేక చెరువులను తలపించేలా ఉన్నాయని, ఖరీఫ్‌ సీజన్‌ లో వరి సాగుకు అవకాశం ఉండదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌కి సోమవారం అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ ఇప్పటికే రెండు సార్లు వరి విత్తనాలు వెద పెట్టా రని, పల్లపు పొలాలు ముంపునకు గురై నష్టం వాటి ల్లిందని అన్నారు. చిలువూరులో ఉత్తరం వైపు జగ నన్న కాలనీల పక్కన సుమారు 250 ఎకరాలకు పైగా పొలాల్లో నీరు నిలిచి పోయాయని చెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా నెల రోజులైనా పంట చేలు ఆరుదలకి రావని, ఖరీఫ్‌ సీజన్లో పంటలు వేసే అవకాశం ఉండదే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పెనుమూలి, మంచికలపూడి,తుమ్మపూడి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి వర్షపు నీటిని బయటకు పంపే చర్యలు తీసుకోవాలని కోరారు. తహశీల్దార్‌ మల్లేశ్వరి డ్రైనేజీ జెఇ, ఇరిగేషన్‌ అధికారుల తో మాట్లాడారు. డిఆర్బిసి వాగు మాత్రం తమ పరిధిలో ఉందని, వచ్చి చూస్తామని చెప్పారు. అర్జీ ఇచ్చిన వారిలో సిపిఎం దుగ్గిరాల మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వై .బ్రహ్మేశ్వరావు, బి.అమ్మిరెడ్డి,బి.చిరంజీవి పాల్గొన్నారు.

 తూటికాడను తొలగించండి
మండలంలోని చిలువూరులో ఊదర కాలువలో అల్లుకుపోయిన తూటికాడ చెట్లను యుద్ధ ప్రతిపాదికన తొలగించాలని కోరుతూ కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు, స్థానిక రైతులు కలిసి గ్రామ పంచా యితి కార్యదర్శి కె.లక్ష్మికి సోమవారం వినతిపత్రం అంద జేశారు. వెంటనే పంచాయితి ఎఇ శ్రీనివాసరావుతో మాట్లాడారు. వారు వెంటనే నీరు బయటకు పోయే విధంగా చూస్తామని చెప్పారు. కౌలు రైతు సంఘం గ్రామ అధ్యక్షులు బి. కనకాంబరం, కె. దావీదు, కె.వెంకటేశ్వర రావు,ఎం.కోటేశ్వరరావు,ఎల్‌.శ్రీనివాసరావు, ఎన్‌.శేష్‌ కుమార్‌, ఎన్‌. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.