రైతుల సమస్యలపై ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న డిఇ భాస్కర్‌రెడ్డి
ప్రజాశక్తి బుక్కపట్నం : బుక్కపట్నం చెరువు కింద రైతుల పంట పొలాలకు సాగునీరు విడుదలకు పంచాయతీరాజ్ డిఇ భాస్కర్ రెడ్డి తనవంతు కృషి చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు స్థానిక పంచాయతీరాజ్ డిఇ భాస్కర్ రెడ్డికి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఆయన రైతులతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మాట్లాడారు. రైతులను నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రైతుల సౌకర్యం కోసం నీరు వదలాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీలత గోవర్ధన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










