Aug 29,2023 00:46

నీటిని విడుదల చేస్తున్న జెడ్‌పిటిసి రాంబాబు

ప్రజాశక్తి వడ్డాది :బుచ్చయ్యపేట మండలం మంగళాపురం ఆనకట్టు నీరును జడ్పిటిసి దొండా రాంబాబు సోమవారం విడుదల చేశారు. శిరిజం ఆనకట్టు నీటిని ఆర్‌ఎస్‌ ఛానల్‌ ద్వారా అప్పలరాజుపురం, మంగళాపురం, కుముం దానుపేట, విజయరామరాజుపేట తదితర గ్రామాలకు నీరుని అందించామన్నారు ఆయా గ్రామాల రైతుల సహకారంతో కాలువలో పూడికను తీసి. నీరు ప్రవహించే విధంగా చేశారని తెలిపారు. దీంతో పరిసర ప్రాంత గ్రామ రైతులు పంటలు పండించే అవకాశం ఉంటుందని అన్నారు ఈ ఆర్‌ఎస్‌ ఛానల్‌ ద్వారా నీరు ప్రవహించడానికి సహకరించిన ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌ ఏఈ త్రినాధరావు, శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీకి సర్పంచులు యల్లపు విజయకుమార్‌, కంటే పద్మరేఖలు కృతజ్ఞతలు తెలిపారు.