ప్రజాశక్తి - ఆగిరిపల్లి
రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవడంతో పాటు ఆర్‌బికెలల్లో ఈకెవైసి చేయించుకొని ధాన్యం విక్రయాలల్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కోరారు. సోమవారం మండల పరిధిలోని వడ్లమాను గ్రామంలో పంట నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించి వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు, వ్యవసాయాధికారి పి.చెన్నారావు, విస్తరణాధికారి కె.ధనబాబు, విఆర్‌ఒ నాగరాజులు పాల్గొన్నారు.










