పంటకోత ప్రయోగాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ముఖ్య ప్రణాళికాధికారి సాలెంరాజు సోమవారం పంట కోత ప్రయోగాలను పరిశీలించారు. మండలంలోని పేడూరు గ్రామం సర్వే నెంబర్ 132-9 లో అర్ధ గణాంక, వ్యవ సాయ శాఖలు సంయుక్తంగా పంట కోత ప్రయోగం చేశారు. వ్యవసాయ సహాయకులు ద్వారా నిర్వహించిన పంటకోత ప్రయోగాన్ని జిల్లా సిపిఒ సా లెంరాజు స్వయంగా పర్యవేక్షిం చారు. వ్యవసాయ విస్తరణా ధికారి హరిబాబు, విఏఎ శివ, వినీల్ లు ఈ ప్రయోగాన్ని ని ర్వహించారు. సిపిఒ వెంట జిల్లా ఉపగణాం కాధికారిణి శోభారాణి ఉన్నా రు. సహాయ గణాంకాధికారి రాంప్రసాద్, విఏఎలు విద్యా సాగర్ సుమంత్ ఉన్నారు.










