Oct 10,2023 23:19

ప్రజాశక్తి-రామచంద్రపురం
ప్రధాన పంట కాలువల్లో గుర్రపు డెక్క చెత్త పేరుకుపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన విషయంపై ' సాగునీటికి అవరోధం' అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన వార్త కు ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్‌ ఎఇ సుజాత సిబ్బందితో ఇంజరం కెనాల్‌ లోను, శివల, కుడుపూరు వెళ్లే కాలువలను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్త చెదారం, గుర్రపు డెక్కన్‌ కూలీలతో పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో గుర్రపు డెక్క, తూటి కాడ కాలువల్లో పెరిగిపోయి సాగునీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతాయి అని వీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఇరిగేషన్‌ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి ఏటా రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా తమ వంతు పనులు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా పంటకాలలో నీటి ప్రవాహం పెంచేందుకు డిఇతో పాటు మిగిలిన అధికారులతో మాట్లాడి నీటి సాంద్రత పెంచమని దీని ద్వారా ప్రస్తుతం తొలకరి రైతులకు సాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. రైతుల సమస్యను అధికారుల దష్టికి తీసుకువచ్చిన ప్రజాశక్తి దినపత్రికను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.