Nov 01,2023 23:12

ప్రజాశక్తి - చెరుకుపల్లి
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగునీటిని పొదుపుగా వాడాలని, ఇతరులకు కూడా అవకాశం కల్పించాలని ఎఒ టి బాలాజీ గంగాధర్ సూచించారు. మండలంలోని రాంబోట్లపాలెం, బలుసుల పాలెం, చెరుకుపల్లి గ్రామాలలోని పంట పొలాల కాలువలను ఇరిగేషన్ ఏఈతో కలిసి బుధవారం పరిశీలించారు. నీటి విడుదల జరిగినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వలన దిగువ పొలాలకు నీరు అందరం లేదని తెలిపారు. రైతులు సాగునీటిని జాగ్రత్తగా వాడుతూ పక్క రైతులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. వీరి వెంట ఇరిగేషన్ ఏఈ రవీంద్ర పాల్గొన్నారు.