ప్రజాశక్తి - చింతలపూడి
నీరు లేక ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. చింతలపూడి పట్టణంలో డిసిఎంఎస్ వద్ద ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. దళారుల ప్రలోభాలకు రైతులు గురికావొద్దన్నారు. రైతులకు ధాన్యం కోనుగోలు సంచులను ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుందని, రవాణా ఖర్చులు కూడా భరిస్తుందని తెలిపారు. రైతుల సమస్యలపై మిల్లర్లతో మాట్లాడి రైతులకు నష్టం లేకుండా చూస్తామన్నారు. తేమశాతంలో తప్పులు చేయొద్దని సిబ్బందికి సూచించారు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తరువాత మాత్రమే విక్రయించాలని రైతులను కోరారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉపసంచాలకులు నాగకుమార్, తహశీల్దార్ కృష్ణజ్యోతి, ఎఒ మీనాకుమారి, చింతంపల్లి సర్పంచి రామకృష్ణ, యడ్ల మోహన్, మిర్యాల దిలీప్, అలవాల బాబు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.