Jul 29,2023 23:17

ప్రజాశక్తి - యానాం స్థానిక దరియాలతిప్ప ఐలాండ్‌ నెంబర్‌ 3 వద్ద నున్న ఎస్‌సి సొసైటీ భూముల వరి పండించే పంట చేల్లోకి వరద నీరు చేరింది. గత సంవత్సరం వరదల తాకిడికి జిఎస్పిసి సంస్థ నిర్మించిన గట్టు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో అప్పటినుంచి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంవత్సరం వచ్చిన వరదలకి పంట చేలలోకి పూర్తిగా వరద నీరు చేరిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రింగ్‌ బండ్‌ ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు కమిడి బాలయోగి, సబ్బతి శ్రీనివాసరావు, గిడ్ల వెంకన్న, దాసరి బుజ్జి డిమాండ్‌ చేశారు.