May 14,2023 02:04
వేసవి ఖోఖో శిక్షణలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు

ప్రజాశక్తి-పంగులూరు: ఈనెల ఏడో తేదీ నుంచి పంగులూరు లోని మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్‌ కళాశాలలో ,ఆంధ్ర ప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో, బాపట్ల ,ప్రకాశం జిల్లాల ఉమ్మడి స్పోర్ట్స్‌ అథారిటీల ఆధ్వర్యంలో ఖోఖో వేసవి శిక్షణ శిబిరం జరుగుతుందని, కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మేకల సీతారామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోచింగ్‌ క్యాంపులో ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుండి బాలికలు 30 మంది, బాలురు 40 మంది, పురుషులు 30 మంది, పాల్గొంటారని తెలిపారు. ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి, ఎనిమిదిన్నర గంటల వరకు, సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ,ఆరున్నర గంటల వరకు జరుగుతుందని, పురుషులకు ఐదు గంటల నుండి, సాయంత్రం 8:30 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సీతారాం రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు కోచ్‌లుగా సీతారామిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్‌ క్రీడాకారులు శిక్షణ ఇస్తారని తెలిపారు. జూన్‌ నెల ఒకటో తేదీ వరకు ఈ శిక్షణ ఉంటుందని సీతారామరెడ్డి చెప్పారు. ఈ శిక్షణకు బాపట్లజిల్లా చీఫ్‌ కోచ్‌ కే.ఏ. పాల్‌ కుమార్‌, ప్రకాశం జిల్లా చీఫ్‌ కోచ్‌ రాజరాజేశ్వరీ లు అనుమతులు తెలిపారని, ఈ సందర్భంగా సీతారామిరెడ్డి వారికి కతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో క్రీడాకారులకు ఉచిత భోజన వసతులు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.