Sep 06,2023 21:00

పండుగలు సంప్రదాయానికి ప్రతీకలు

 వేంపల్లె : స్థానిక బిడ్డాలమిట్టలో ప్రాంతంలో ఉన్న వికాస్‌ పాఠశాలలో బుధవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కరస్పాండెంట్‌ షేక్‌ రఫియా తెలిపారు. పాఠశాల ఆవరణలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కీష్ణుడు, గోపికల వేషధారణలు అందరిని అలరించాయి. కరస్పాండెంట్‌ రఫియా మాట్లాడుతూ పండగలు సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. అలాగే వడ్డెర వీధిలో ఉన్న కృష్ణాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించి, అన్నదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు నజీర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ డేరంగుల రామాంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలోని ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక జమ్మలమడుగు శాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు డాక్టర్‌ ఎంపీ మునిరెడ్డి కాంప్లెక్స్‌ వేదికగా ఘనంగా నిర్వహించారు. పూజలనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా వైసిపి నాయకుడు హనుమంతురెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు ప్రత్యేకంగా శ్రీకృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎస్పీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి ప్రెసిడెంట్‌ రంగనాయకులు, సభ్యులు నాగరాజు, సాయి, రమణ, నారాయణరెడ్డి, నరసింహ, సందీప్‌, వెంకటరెడ్డి, చలపతి, మల్లీశ్వరి పాల్గొన్నారు. కొండాపురం : పట్టణంలోని శ్రీస్వామి వివేకానంద విద్యాలయంలో శ్రీకృష్ణా ష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల శ్రీకృష్ణుడు, రాధ, గోపిక వంటి వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ బి.లింగేశ్వరరెడ్డి, ఉపాద్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : స్థానిక శ్రీకష్ణ గీతాశ్రమంలో ఉన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమన్ని కళాశాల కరస్పాం డెంట్‌ అర్కటవేముల హరి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలో యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారని, రంగులు కలిపిన వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అందరిలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుందన్నరు. విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ ముస్తఫా, కో-ఆర్డినేటర్‌ గౌరీ శంకర్‌, సలీం, దావీద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.