Aug 11,2023 21:04

పోలీసు బలగాల పరేడ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్య సాయి జిల్లాలో ఆగస్టు 15 న నిర్వహించే 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా, మండల కేంద్రాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు నిర్వహించాలని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా పుట్టపర్తి లోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరుగు సాయుధ బలగాల పోలీస్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ మాధవ్‌ రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేడుకలలో భాగంగా ఎటువంటి భద్రత పరమైన లోపాలు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణు ఏఆర్‌ డిఎస్‌పి విజరు కుమార్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ టైటస్‌, ఎంటిఒ నారాయణ, ఆర్‌ఐ శ్రీశైలం రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.