Sep 11,2023 00:16
పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: ఉత్తరప్రదేశ్‌ ఘోసి నియోజకవర్గంలో ఈ నెల 8న వెల్లడైన ఉప ఎన్నిక ఫలితాల్లో సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థి సుధాకర్‌ సింగ్‌ విజయం సాధించిన సందర్భంగా ఆదివారం బాపట్ల బీసీ సంఘం కార్యనిర్వాహకులు గొర్ల శ్రీనివాసరావు నిర్వహణలో బాపట్ల జిల్లా సమాజ్‌ వాది పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ధారాసింగ్‌ చౌహాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించాలన్న లక్ష్యంతో సమాజ్‌ వాది పార్టీ కృషి చేస్తోందని అన్నారు. ఈ పరిణామంతో రాబోయే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, బీసీ సంఘం సీనియర్‌ నాయకుడు రత్నరాజు, బీసీ నాయకులు ఎనుముల భాస్కర్‌ గౌడ్‌, అంజుమన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కరీం, అబ్దుల్‌ రఫీ, అబ్దుల్‌ గఫూర్‌, అబ్దుల్‌ ఖాదర్‌ బాషా, మౌలాలి, కరిముల్లా, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, నక్కల రాంబాబు, కొమ్మనబోయిన ఫణీంద్ర, గండికోట వెంకటరావు, అంగలకుదురు నటరాజన్‌, బోయిన శ్రీనివాసరావు, శరత్‌, రాజారావు, ఎల్లావుల రమేష్‌, దర్శి భాస్కరరావు, కోమ్మనబోయిన చరణ్‌, తోట సతీష్‌, చీమకుర్తి కృష్ణ చైతన్య పాల్గొన్నారు.