అరటిపండ్ల దుకాణాన్ని పరిశీలిస్తున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు
ప్రజాశక్తి-చీరాల: అరటికాయలతో పాటు ఇతర పండ్లపై కృత్రిమ రసాయనాలు కలిపితే చర్యలు తప్పవని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కెవీ సుబ్బారావు అన్నారు. శనివారం పట్టణంలోని పండ్ల మార్కెట్లో పలు దుకాణాలను ఆయన సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. పలు కాలపండ్లను క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా పండిన పండ్లను మాత్రమే ప్రజలకు విక్రయించాలన్నారు. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించే విధంగా రసాయన మందులను పిచికారీ చేసి విక్రయిస్తే వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కొన్ని పండ్లను, అరటికాయలను శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్. ల్యాబుకు పంపుతామన్నారు. తదుపరి వచ్చిన నివేదిక ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.










