రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం తగదు : సిపిఎం
ప్రజాశక్తి- కూనవరం : క్రిస్మస్, సంక్రాంతి కానుకలకు మంగళం పాడేసిన ప్రభుత్వం, ప్రతినెలా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని కూడా సంక్రాంతి పండుగకు ముందు ఇవ్వకపోవడం దారుణమని మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అన్నారు. ఏజెన్సీలోని నిరుపేద గిరిజనుల్లో అనేకమందికి రేషన్ బియ్యమే ఆధారంగా ఉంటోందని, అటువంటి పరిస్థితుల్లో ఈనెల15లో చౌకధరల దుకాణాల ద్వారా ఇంటింటికి ఇవ్వవలసిన రేషన్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. పండుగకు ముందు రేషన్ ఇవ్వకపోవడం ద్వారా అనేక పేదల గిరిజనులను ప్రభుత్వం పస్తులుంచాలనుకుంటోందా అని ప్రశ్నించారు. సంక్రాంతికి రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కానుక ఇదేనా అని వాపోయారు. తక్షణమే రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో తలగాని నాగరాజ,ఆవుల మురళి, కుంజా రాధ,జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు తాళ్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు










