ప్రజాశక్తి- సీతమ్మధార : విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పంచకర్ల నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశాక, సీతమ్మధారలోని ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పంచకర్లకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
ఈ సందర్భంగా పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బాధ్యతను అందరి సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ ముఖ్యనేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు
పంచకర్లను సత్కరించిన రాజు
ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు నియోజకవర్గ నేతలతో వచ్చి పంచకర్లను దుశ్శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు కంపా హనోక్, అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు సారిపిల్లి గోవింద్, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్‌రాజు, సాడి పద్మారెడ్డి, పి.ఉషశ్రీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ ాజు, 48వార్డు ఇన్‌చార్జి నీలి రవి, సీనియర్ నేతలు బి.యన్ రాజు, సప్పంగి శ్రీను, క.చిన్నా, జక్కంపూడి సత్యన్నారాయణ, జి.కపపాల్గొన్నారు.
ఆరిలోవ నేతల అభినందన
ఆరిలోవ : వైసిపి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన పంచకర్ల రమేష్‌బాబును మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ పేర్ల విజరుచందర్, సీనియర్ నేతలు గూడపాటి విక్టర్, వాణపల్లి ఈశ్వరరావు, సత్యాల వెంకట్, పారిపల్లి రామారావు, శంకరరావు సత్కరించి అభినందనలు తెలిపారు.










