Aug 01,2023 21:24

పంచాయతీలను అభివద్ధి చేశాం : ఎమ్మెల్యే

కలసపాడు : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను జగనన్న సంక్షేమ పథ కాలతో, ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, ఇచ్చిన హామీలలో 98 శాతం పూర్తిచేశామని బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ డి సుధ తెలిపారు. మంగళవారం మండలంలోని పిడుగుపల్లె గ్రామపంచాయతీలో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలోనూ ప్రజలకు అన్ని వసతులు కల్పించామని చెప్పారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, మంచినీటి వసతులు, ఇలా ప్రతి ఒక్కటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంకన్న గోవిందమ్మ, జడ్‌పిటిసి అంకన గురి విరెడ్డి, రాజుపాలెం సర్పంచ్‌, ఎంపిపి సుధా రామకష్ణారెడ్డి, మండల ఉపాధ్య క్షుడు, భాస్కర్‌ రెడ్డి, ఎంపిడిఒ మహబూబ్‌బి, తహశీల్దార్‌ రవీంద్రారెడ్డి, ఎంపిపి నిర్మల నారా యణ, లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌, సింగల్‌ విండ్‌ అధ్యక్షుడు పెద్దిరెడ్డి పురుషోత్తంరెడ్డి, కార్యకర్తలు, ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు.
పథకాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే సుధ