Oct 22,2023 21:49

జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి

 కడప ప్రతినిధి : పంచాయతీ ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎస్‌డబ్య్లుపిసి నిధుల జమ మొదలుకుని 15 ఫైనాన్స్‌ నిధుల వినియోగం, సకాలంలో పన్నులను సేకరణపై దృష్టి సారించాం. ఫలితంగా జిల్లాలోని 557 పంచా యతీల్లో పారిశుధ్యం మొదలుకుని పచ్చదనం, పరిశుభ్రతను పెంపొం దించి ప్రజారోగ్యాన్ని పెంపొందిస్తాం. ఉపాధి హామీ నిధుల సహాయంతో పంచాయతీల్లోని గృహాలు మొదలుకుని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచడంతో పచ్చదనాన్ని పరుస్తాం. దీంతోపాటు స్వమిత్ర పథకం కింద పంచాయతీల్లో ప్రజల స్థిరాస్తుల గణన ద్వారా శాశ్వత హక్కులు కల్పించే విధంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టడమైం దని పేర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి డి.ప్రభాకర్‌రెడ్డితో ప్రజాశక్తి ముఖాముఖి...
పంచాయతీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటి?
పంచాయతీలను బలోపేతంపై దృష్టి సారించాం. ఉపాధి హామీ సహాయంతో పంచాయతీల పరిధిలోని 2,246 గ్రామాల్లోని ఇళ్లు, రహ దారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చ దనాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. 15 ఫైనాన్స్‌ నిధుల విని యోగం ద్వారా పారిశుధ్యాన్ని పెంపొందిస్తాం. ఎస్‌డబ్య్లుపిసి ప్లాంట్ల సహా యంతో సాలిడ్‌ వేస్ట్‌ వేనేజ్‌ వ్యవస్థ ద్వారా చెత్తా చెదారాన్ని సేకరించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ ఖాతాల్లో జమ చేయడం, వర్మీ కం పోస్టు ఎరువును తయారు చేసి సరసమైన ధరలకు రైతులకు విక్రయిస్తాం. తద్వారా భూ కాలుష్యాన్ని నియంత్రించే పంటలు వృద్ధి చెందే ప్రయత్నం జరుగుతోంది.
పంచాయతీ వివరాలు తెలపండి?
జిల్లాలో 557 పంచాయతీలున్నాయి. ఇందులో వేంపల్లి, నందిమండలం, చెన్నూరు, ఖాజీపేట, కొత్తపల్లి, గోపవరం, పోరుమామిళ్ల, రంగసముద్రం మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా పంచాయతీల పరిధిలో 2,246 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని పంచాయతీల నిర్వ హణను 427 మంది కార్యదర్శులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తు న్నారు.
జగనన్న స్వచ్ఛసంకల్పాన్ని వివరించండి?
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా డైలీ క్లాప్‌ మిత్రలు ఇంటింటికీ తిరిగి తడిపొడి చెత్తలను వేరు చేసి పొడిచెత్తలోని గాజుముక్కలు, ప్లాస్టిక్‌వ్యర్థాలను సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూపంలో సంపదను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఎస్‌డబ్య్లుపీసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేస్తాం. కొన్ని మేజర్‌ పంచాయతీల్లో వచ్చే అధిక ఆదాయాన్ని డైలీ క్లాప్‌మిత్రలకు వేతన రూపంలో సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటోంది.
ఎల్‌డబ్య్లుఎం కార్యకలాపాల గురించి చెప్పండి?
లిక్విడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌డబ్య్లుఎం)లో భాగంగా పంచాయతీల్లోని నీటి వృథాను అరికట్టడం, డ్రెయినేజీ క్లీనింగ్‌, డ్రెయి నేజీ బ్లాకింగ్‌, వాటర్‌ స్టాగేషన్‌ ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌ వేయడం ద్వారా దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం.
పారిశుధ్య నిర్వహణ చర్యలేమిటి?
జిల్లాలోని 557 పంచాయతీల పరిధిలోని 2,246 గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు 626 పారిశుధ్య నిర్వహణ కేంద్రాలున్నాయి. ఇందులో 525 పారిశుధ్య కేంద్రాల్లో 1301 క్లాప్‌మిత్రలు, 1304 ట్రైసై కిళ్ల సహాయంతో పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగింది.
ఓడిఎఫ్‌ ఫ్లస్‌ అంటే ఏమిటి?
ఓడిఎఫ్‌ ప్లస్‌ అంటే ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ అని అర్థం. జిల్లాలోని 557 పంచాయతీల వారీగా అమలుకు గట్టి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు ఇరువైపులా మలవిసర్జన నివారణకు కృషి జరుగుతోంది. తక్కువ సమయంలో ఇటువంటి వ్యర్థాల నివారణపై అవగాహన కల్పించే కృషి ఊపందుకుంది.
స్వమిత్ర పథకం తీరుతెన్నుల గురించి తెలపండి?
స్వమిత్ర పథకం కింద పంచాయతీల పరిధిలోని ఆయా రెవెన్యూ గ్రామాల ప్రజలకు సంబంధించిన స్థిరాస్తుల వాణిజ్యీకరణ ఊపందుకుంది. సంబధిత పథకం కింద ఆయా గ్రామాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా ప్రజల ఆస్తులను గణిస్తారు. అనంతరం సంబంధిత ఆస్తులకు మార్కెట్‌ విలువను జోడించడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల ఆస్తులకు రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పన ద్వారా భద్రత కల్పించడం జరుగుతుంది.
స్వమిత్ర పథకం సర్వే ఎలా సాగుతోంది?
జిల్లాలోని 731 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 625 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేపట్టనున్నాం. ఇందులోభాగంగా 188 గ్రామాల్లో మ్యాపు-1 పిపిఎంఎస్‌ను తీయడమైంది. ఇందులో 110 ఇళ్లు, ఇళ్ల స్థలాలను గుర్తించడమైంది. ఇందులో 147 మ్యాప్‌-2 పిపి ఎంఎస్‌ తీయడమైంది. ఇందులో 93 భూ ఆధారిత గుర్తింపు ప్రక్రి యల్ని పూర్తి చేయడమైంది.17 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా పూర్తి స్థాయి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో72గ్రామాల్లో ఆస్తుల డ్రా ప్ట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడమైంది.