Dec 07,2022 23:28

ఎంపీడీవో సీతారామరాజు


ప్రజాశక్తి-నక్కపల్లి:గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీవో సీతారామరాజు సూచించారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కి ప్రణాళిక శిక్షణా కార్యక్రమంలో భాగంగా సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలు, గ్రామ ప్రణాళికలు తయారు చేయాలని, పేదరిక నిర్మూలన, వృద్ధుల, బాలికల ప్రణాళిక, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు గ్రామ సభల ద్వారా రూపొందించి ఆమోదం పొందాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంశాస్త్రి, ఈఓపిఆర్‌డి వెంకటనారాయణ, జెడ్‌ పిటిసి గోసల కాసులమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీషం నానాజీ, ఉపాధి ఏపీవో ఈశ్వరరావు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు .
రావికమతం: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులందరూ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవో వెంకన్న బాబు తెలిపారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అవి అబివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్‌డి రమణయ్య పాల్గొన్నారు.
మాకవరపాలెం: మండలంలో అభివద్ధి పనులపై సర్పంచులకు, ఎంపిటిసిలకు, సచివాలయం సిబ్బందికి శిక్షణ తరగతులు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అరుణశ్రీ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేసే నిధులపై తీర్మానాలు తప్పని సరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్‌డీ సీతామహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.