Dec 09,2022 00:03

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ వీర కిషోర్‌

ప్రజాశక్తి-మారేడుమిల్లి
పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు కీలకపాత్ర వహించాలని మారేడుమిల్లి జడ్పిటిసి గొర్లె బాలాజీబాబు అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వీర కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో జడ్పిటిసి బాలాజీ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పంచాయతీల అభివద్ధికి తీసుకోవాల్సిన కీలక అంశాలను వివరించారు. పంచాయతీల్లో తాగునీరు, చేతిబోర్లు, వీధిలైట్లు, రహదారులు అంశాలను సర్పంచులతో చర్చించారు. పంచాయతీల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి, కుండాడ, గుజ్జుమామిడివలస, చావడకోట దొరచింతలపాలెం, డి వెలమలకోట, తాడేపల్లి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.