అభివృద్ధి ప్రణాళిక బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న ఎంపిపి వాసురాజు
ప్రజాశక్తి -భీమునిపట్నం : పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24పై సర్పంచులు, ఎంపిటిసి సభ్యులకు సోమవారం ఎండిఒ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఇందుకు రూపొందించిన బుక్‌లెట్‌ను ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు (వాసు రాజు), జెడ్పీటీసీ సభ్యులు గాడు వెంకటప్పడు ఆవిష్కరించారు. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులతోపాటు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల క్షేత్ర స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అభివృద్ధి ప్రణాళిక తయారీ, అమలుపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఎండిఒ పి.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి పంచాయతీ విస్తరణాధికారి శంకర్‌జగన్నాథ్ నోడల్ అధికారిగా వ్యవహరించారు.










