
ప్రజాశక్తి- నక్కపల్లి:హెటిరో కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా పంచాయతీ తీర్మానం చేయాలని వార్డు మెంబర్లు, గ్రామస్తులు కోరారు. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేసారు.రాజయ్యపేట పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సాధారణ సమావేశంలో 8 అంశాలలో 7వ అంశం తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కంపెనీ వ్యర్ధ జలాలను పాత పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేట సాగక పోవడంతో చాలామంది మత్స్యకారులు వలస పోతున్నారని తెలిపారు. కంపెనీ కాలుష్యంతో అనేకమంది రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.కంపెనీతో జరుగు నష్టాలను దృష్టిలో పెట్టుకుని పైప్‌లైన్ వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సిఆర్‌జెడ్ అనుమతులు రద్దు చేసే విధంగా పంచాయతీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోసల స్వామి, పిక్కి తాతీలు, చేపల సోమేష్, పీక్కి వీర్రాజు, మహేష్ బాబు, మైలపల్లి నరేష్, పీక్కి శ్రీను, పీక్కి కాశీ, పీక్కి కోటేశ్వరరావు, వాసుపల్లి వెంకటేష్, దైలపల్లి రమణ, పీక్కి లోవరాజు, పీక్కి ఆదిరాజు, మైలపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.