Jul 22,2023 21:20

పంచాయతీ పరిధిలోనే సచివాలయం ఉండాలిసుదూర ప్రాంతంలో ఏర్పాటుపై ప్రజల ఆగ్రహం

నందలూరు : జిల్లాలోని మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీకి సంబంధించిన నాగిరెడ్డిపల్లె-2 సచివాల యాన్ని నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయడం బాధాకరమని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డిపల్లె పంచా యతీ పరిధిలో మూడు సచివాలయాలు ఉండగా అరవపల్లె లోని పాత పంచాయతీ కార్యాలయంలో సచివా లయం-1, నాగిరెడ్డిపల్లె సచివాలయం-2ను 3 కి.మీ. దూరంగా ఉన్న తహశీల్దార్‌ కార్యాలయాల సమీ పంలో నందలూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజల వద్దకే పాలన అనే ధ్యేయంతో సచి వాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సచివాల యాలను గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలనే సంక ల్పానికి విరుద్ధంగా సచివాల యాన్ని ఏర్పాటు చేశార న్నారు. తొమ్మిదివేల పైచిలుకు ఓటర్లున్న గ్రామ పంచా యతీపై స్థానిక ప్రజా ప్రతి నిధులు వైఫల్యంతో సంబం ధిత సచివాలయాన్ని వేరే గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్ని స్తున్నారు. దూరంగా ఏర్పాటు చేసిన సచివాలయాలకు పోవా లంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది మారు తోందని ఆటో ఛార్జీలకు రూ.100 వరకు ఖర్చ వుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికా రులు, ప్రజా ప్రతి నిధులు స్పందించి నాగిరెడ్డిపల్లె పంచాయతీకి సంబంధించిన సచివాల యాలను పంచాయతీ పరిధిలోనే ఏర్పాటు చేయాలని కోరారు. నాగిరెడ్డిపల్లె-2 గ్రామపంచాయతీ సచివాలయం