ప్రజాశక్తి - మండవల్లి
తాగునీటి ఎద్దడిని అధిగమించే విధంగా గ్రామంలో పంచాయతీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని కానుకొల్లు సర్పంచి నాగదాసి థామస్ తెలిపారు. పంచాయతీ నిధులతో ఏర్పాటు చేస్తున్న పైపులైన్లను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ఎస్‌సి కాలనీలో సీసీ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా పంచాయతీ నిధులు వెచ్చించి పైపులైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణానంతరం కుళాయిలను వేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రత్నకుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు.










