Jul 12,2023 21:00

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

ప్రజాశక్తి మంత్రాలయం

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్‌ చేశారు. బుధవారం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మండల అభివద్ధి అధికారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు ప్రతినెల వేతనాలు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు అతి తక్కువ వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్‌ అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శి ంచారు. పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గ్రామపం చాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతు న్నట్లు ఆయన హెచ్చరించారు. సిఐటియు మంత్రాలయం మండల కార్యదర్శి జయరాజు, గ్రామపంచాయతీ కార్మికుల నాయకులు ప్రసంగి, చిన్న మారన్న భీమేష్‌ హెజ్కేల్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు.
గోనెగండ్ల : మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం సిఐటియు నాయకుడు బతకన్న కోరారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి రంగనాయకులు, ఎంపీడీవో నగేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌ 551 ప్రకారం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులు దేవదాసు, మునెప్ప, నరసింహుడు, లింగన్న, చాంద్‌ బాషా పాల్గొన్నారు.