ప్రజశక్తి - చీరాల
చాలీచాలని వేతనాలతో పంచాయతీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. కార్మికుల వేతనాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారంకు 2వ రోజుకు చేరుకుంది. మూడేళ్లుగా వేతనాలు పెంచకపోగా ఉన్న వేతనంలో తగ్గించి ఇస్తున్నట్లు తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదన్నారు. 2019లో రూ.18వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికైనా వేతనాన్ని రూ.18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఇన్చార్జి సెక్రెటరీ ప్రసాద్ సమ్మె వాయిదా వేయాలని కోరినప్పటి రోజు వేతనం రూ.400పెంచితేనే విరమిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇండ్ల చెంచయ్య, గడ్డం ప్రసాద్, కాకి భాగ్యమ్మ, తన్నీరు సీతమ్మ పాల్గొన్నారు.










