Jul 14,2023 21:07

పంచాయతీ కార్మికులు దీక్షలు విరమింప చేస్తున్న అధికారులు

మదనపల్లె అర్బన్‌ : పంచాయతీ కార్మికులకు ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ సౌకర్యం కల్పిం చాలని, హైకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, మర ణించిన కార్మికులకు మట్టి ఖర్చులు రూ.25 వేలు ఇవ్వాలని, అక్రమంగా తొల గించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన పంచా యతీ కార్మికుల పోరాటం విజయవంతమైంది. శుక్రవారం మదనపల్లె డిఎల్‌పిఒ నాగరాజు నిరవధిక రిలే దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అంతకు ముందు డిఎల్‌పిఒ, సిఐటియు నాయకులు, పంచాయతీ కార్మికుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం, బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించడం ఈ నెల నుండి ప్రారం భం చేస్తామని, 57 జిఒ ప్రకారం వేతనాలు చెల్లించాలని, తొలగించిన కార్మికు లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీలకు సర్క్యులర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. డిఎల్‌పిఒ హామీతో దీక్షలు విరమించినట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి ఎస్‌.సురేంద్రబాబు ప్రకటించారు. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలని లేని పక్షంలో మరింత ఉధతంగా పోరాటం చేస్తామని హెచ్చ రించారు. ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నవాజ్‌బాషాలు గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కషి చేస్తున్న పంచాయతీ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారు గొంతెమ్మ కోర్కెలు కొనలేదని, ప్రభుత్వం ఇచ్చిన జిఒలను అమలు చేయాలని, ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, వేతనాలు బ్యాంకు ద్వారా ఇవ్వాలని కోరితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం కార్మికులపై కేసులు పెడతారా అని ప్రశ్నిం చారు. నిజాయితీకి మారుపేరుగా గొప్పలు చెప్పుకుంటున్న మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషాకు సర్పంచ్‌లు చేస్తున్న దుర్మార్గం కనపడలేదని విమర్శించారు. పంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేనిప క్షంలో ఈ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవాణా ట్రాన్స్‌ఫోర్ట్‌ జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సంఘం నాయకులు గోపాల్‌, ఇమ్రాన్‌, నాగరాజు, ప్రమీల, శ్యామల, రాజేంద్ర పాల్గొన్నారు.