Apr 24,2023 20:21

సిబ్బందిని సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కౌతాళం
గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికుల సేవలు మరువరానివని వైసిపి మండల కన్వీనర్‌ దేశాయి ప్రహ్లాద చారి, సర్పంచి పాల్‌ దినకరన్‌ పేర్కొన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించడంలో పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య, తాగునీటి సరఫరా, వీధిలైట్లు నిర్వహణ సిబ్బంది నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. సేవలను గుర్తించి శాలువా, పూలమాలలతో సన్మానించారు. తోవి పంచాయతీలో పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచి నరసప్ప, పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్‌ రెడ్డిలు గాంధీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌతాళంలో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచి తిక్కయ్య, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, మాజీ సర్పంచి అవతారం, చౌదరి బసవరాజు, ఉమాపతి, వడ్డే రాముడు పాల్గొన్నారు.