
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిని డిపిఒ మల్లికార్జునరావు
ప్రజాశక్తి - పాలకోడేరు
పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జివికె.మల్లికార్జునరావు తెలిపారు. మండలంలోని గొల్లలకోడేరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావులేకుండా పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపులో ఒకటికి, రెండు సార్లు పరిశీలించుకోవడంతోపాటు, పోటీలో ఉన్న అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డిపిఒతో పాటు ఎన్నికల అధికారులు శివకృష్ణ, రమాలిలా ఉన్నారు.