Aug 28,2023 23:46

పెదకాకాని: పెదకాకాని పంచాయతి కార్మికుల సమస్యలు పరి ష్కరించే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. స్థానిక పంచాయతి కార్యాలయం వద్ద సోమవారం ఎపి గ్రామ పంచా యతి ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో జనరల్‌ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో పని చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు రూ.6,000 ఇస్తు న్నారని, పెరిగిన ధరలకు ఇది ఏమాత్రం సరిపోదని అన్నారు. టెండర్‌ కార్మికులకు మార్చిలో టెండర్లు ప్రతి పాదన పంపాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు టెండర్‌ ప్రతి పాదనలే పంపించలేదని, ప్రతినెలా జీతాలు ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ నెలలు తరబడి జీతాల పెండింగ్‌ ఉన్నాయని, సబ్బులు, నూనె, మాస్కులు, గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని అడిగితే అధికారులు బెదిరిస్తున్నా రని అన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరి ష్కరించే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎన్‌.శివాజీ, నాగలక్ష్మి, అవాజు, రామస్వామి సంతోష్‌ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.