Nov 09,2023 23:47

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
గత నాలుగు రోజుల నుండి ఇంకొల్లు పంచాయతి కార్మీకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సిఐటియు నాయకులు గురువారం మద్దతు ప్రకటించారు. ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన చేశారు. గత 3నెలల నుండి ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లో సభ నిర్వహించారు. అధికారులు, నాయకులు ఎవ్వరూ తమ గోడు పట్టించుకోవటం లేదని పంచాయతి కార్మీకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు పర్చూరు నియోజకవర్గ నాయకులు జి ప్రతాప్‌ కుమార్‌, ఇంకొల్లు నాయకులు నాగండ్ల వెంకట్రావు, పంచాయతి కార్మీకులు రంగారావు, శ్యాం, సుబ్బరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.