
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సందర్శకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అమరావతి (అమరారామం), భీమవరం (భీమారామం), పాలకొల్లు (శ్రీరారామం), ద్రాక్షారామం, సామర్లకోట (కుమారారామం) క్షేత్రాలకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి విజరుకుమార్ తెలిపారు. ఈమేరకు స్థానిక ఆర్‌టిసి కార్యాలయంలో టూర్ షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. పంచారామ క్షేత్రాలను సందర్శించుకునే అవకాశాన్ని ఆర్‌టిసి ఈనెల 19, 26, డిసెంబరు 3, 10వ తేదీల్లో కల్పిస్తోందన్నారు. పలాస, టెక్కలి, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు వెళ్లే వారి కోసం సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం షషష.aజూరత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ (శ్రీకాకుళం నుంచి పంచారామాలు) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆయా తేదీల్లో సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి సోమవారం ఐదు క్షేత్రాలను సందర్శించిన తర్వాత మంగళవారం ఉదయం ఆరు గంటలకు గమ్యానికి చేర్చనున్నట్లు చెప్పారు. ఏదైనా గ్రామం నుంచి పూర్తి బస్సు అద్దె ప్రాతిపదికన టిక్కెట్లు కొనుగోలు చేస్తే, వారికి ఇంటి వద్దకే బస్సును పంపిస్తామన్నారు. బస్సు ఛార్జీలు ఒక వ్యక్తికి శ్రీకాకుళం నుంచి సూపర్ లగ్జరీ రూ.2,400, ఆల్ట్రా డీలక్స్ రూ.2,350, ఎక్స్‌ప్రెస్ రూ.2,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ 9959225608, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7095040608, శ్రీకాకుళం రెండో డిపో మేనేజరు 9959225609, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్): 7382917289 టెక్కలి డిపో మేనేజర్ 9959225611, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్): 7382923311 పలాస డిపో మేనేజరు 9959225610 అసిస్టెంట్ మేనేజర్, (ట్రాఫిక్) 7382924758ను సంప్రదించాలని సూచించారు.