ప్రజాశక్తి - పర్చూరు
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నియోజకవర్గంలో పలువురు టిడిపి నాయకులను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయగా పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారు. పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, కడవకుదురు, మార్టూరు, యద్దనపూడి ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ గేట్లను నెట్టుకుంటూ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్క పరుగున వచ్చి స్థానిక బొమ్మల సెంటర్లో బైఠాయించారు. దీనితో ఒక్కసారిగా సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈతరుణంలో పోలీసులకు కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు కార్యకర్తలను పోలీసు జీవులో ఎక్కించుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.










