పలువురు డాక్టర్లకు సత్కారం
ప్రజాశక్తి-కావలి : డాక్టర్స్ డే సందర్భంగా శనివారం కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని ప్రముఖ వైద్య నిపుణులు, డాక్టర్ ఎన్.ప్రభాకర్ నాయుడు, విశ్రాంత ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ ఆనంద్, మాధవిలతలను, డాక్టర్ కర్నాటి రోహిత్, డాక్టర్ సిహెచ్.నళినిపద్మ, డాక్టర్ సిహెచ్.ప్రసాద్, డాక్టర్ ఎం.రామ స్వామీ, డాక్టర్ అల్లం శ్రీనివాసులు, డాక్టర్ పి.పద్మశ్రీ లనుకలిసి, ''డాక్టర్స్ డే'' శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పిఎంపి కావలి అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రమణయ్య, గౌరవ అధ్యక్షులు, షేక్.ఖాదర్‌బాషా మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని కొంత మంది డాక్టర్స్‌ను కలిశారు. కార్యక్రమంలో పిఎంపి కావలి డివిజన్ ప్రధాన కార్యదర్శి, షేక్.జీలానీబాషా, సలహాదారులు ఎం.మాలకొండారెడ్డి, ఒ.మస్తానయ్య వైస్‌ప్రెసిడెంట్ డి.సుబ్రహ్మణ్యం, ఈసీ మెంబెర్స్, తదితరులు పాల్గొన్నారు.










