Jun 08,2023 23:41

అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపిపి జయలక్ష్మి

ప్రజాశక్తి -మునగపాక రూరల్‌
కొత్తగా నియమితులైన మండల అధికారులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మునగపాక ఎంపీడీవోగా మన్మధరావు, తహశీల్దారుగా ప్రకాష్‌రావు, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఏవో)గా ప్రసాద్‌ కుమార్‌ మండల కేంద్రంలోని వారి వారి కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఏవోగా పనిచేసిన మన్మధరావు ఉద్యోగోన్నతిపై మునగపాక ఎంపీడీవోగా వచ్చారు. తహశీల్దారు ప్రకాష్‌రావు పరవాడ నుండి బదిలీపై ఇచ్చారు. అనకాపల్లిలో ఏవోగా పని చేసిన ప్రసాద్‌కుమార్‌ బదిలీపై ఇక్కడకు ఎఒగా వచ్చారు. గతంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన రవికుమార్‌ ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోగా బొబ్బిలికి బదిలీ అయ్యారు. కొంత కాలంగా ఇన్‌ఛార్జి తహశీల్దారు ఉండగా, ప్రకాష్‌ రావు రాకతో ఆ పోస్టు భర్తీ అయింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైసిపి మండల కన్వీనర్‌ ఆడారి గణపతి అచ్చం నాయుడు, ఎంపీటీసీ బొడ్డేడ బుజ్జి, సిబ్బంది, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంపిడిఒకు అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరణ
యలమంచిలి రూరల్‌ : ఎలమంచిలి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపిడిఒ)గా కె.అప్పలనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రసాదరావు ఇన్‌ఛార్జి ఎంపిడిఒగా పని చేశారు. నూతన ఎంపిడిఒగా బాధ్యతలు చేపట్టిన అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మండలంలో సర్పంచులు, అధికారులు అప్పలనాయుడుకు పుష్ప గుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ అప్పలనాయుడు మాట్లాడుతూ యలమంచిలి, పరిసర గ్రామాలు అభివద్ధికి కృషి చేస్తానని, దీనికి సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.