ప్రజాశక్తి - పంగులూరు
మండలంలో అనారోగ్యాలతో బాధపడుతున్న పలువురిని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ శనివారం పరామర్శించారు. మాజీ సిఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి విజయవాడ తరలించే సందర్భంలో ముప్పవరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన లాఠీచార్జీలో కంటికి గాయమై తీవ్ర రక్తస్రావమైన పంగులూరు టిడిపి కార్యకర్త పోదా రామాంజనేయులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నందవరపు సిద్దయ్యను పరామర్శించారు. పంచర్ షాపులో ప్రమాదవశాత్తు టైరు పేలి గాయపడిన షేక్ మీరావళిని పరామర్శించి ఆరోగ్య విషయం వాకబు చేశారు. ఇటీవల మరణించిన శ్రీరామమూర్తి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండలంలోని ముప్పవరంకు చెందిన దాసరి ఆంజనేయులు, ఇంటూరి హనుమయ్య మోకాలు చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఇటీవల గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న దుడ్డు ముత్తయ్యను పలకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చింతల అక్కయ్య, వేల్పుల దీనమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా పలకరించి ఓదార్చారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్, మాజీ మండల అధ్యక్షులు కుక్కపల్లి ఏడుకొండలు, మాజీ జడ్పిటిసి కర్రీ వెంకట సుబ్బారావు ఉన్నారు.










