
ప్రజాశక్తి - పెనుమంట్ర
ఆదివారం తెల్లవారుజామున మండలంలో వర్షం కురిసింది. దీంతో పొలమూరు నుంచి నౌడూరు సెంటర్‌కు వెళ్లే ఆర్‌అండ్‌బి రహదారి అధ్వానంగా తయారైంది. గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి సయయాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొగల్తూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ఆదివానం వర్షం కురవడంతో ప్రజలు సేదతీరారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు.