Mar 05,2023 23:25

వైద్య నిపుణులు

ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్‌:స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కిమ్స్‌ ఐకాన్‌ సూపర్‌ స్పెషాలిటీ ప్రముఖ వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం నవ్య లైన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు వైద్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ప చింతకాయల సన్యాసిపాత్రుడు, వెలగ నారాయణరావు, నవ్య లైన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.
రావికమతం: మేడివాడ గ్రామానికి మాజీ సర్పంచ్‌ పతివాడ చిన్ననాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రతివాడ ధనంజరు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.వైద్యులు వరహాలు 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 40 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. దీంతో వీరందరినీ శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి ఆదివారం బస్సులో తరలించారు.