ప్రజాశక్తి -గాజువాక : సమాజాభివద్ధికి గురువులు చేసిన సేవలు మరువలేనివని, త్రిపుర యూనివర్సిటీ మాజీ వైస్‌ఛాన్స్‌లర్ పిఎస్ అవధాని అన్నారు. శ్రీనగర్‌లోని ఆపిల్‌ఐ స్కూల్, టిఎస్‌ఆర్ టిబికె కాలేజీలో గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. నలుగురు ఉత్తమ అధ్యాపకులకు రూ.పది వేలు చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, చైర్మన్ బలరామకృష్ణ, డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ స్కూల్ ప్రిన్సిపాల్ ముఖర్జీ పాల్గొన్నారు.
భాస్కర్ విద్యానికేతన్ పాఠశాలలో గురుపూజోత్సవంలో స్కూల్ కరస్పాండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు. ఎంవిఆర్ విద్యాసంస్థలో అనకాపల్లి జిల్లా క్రైమ్ ఎస్‌పిబి. లక్ష్మ్మినారాయణ, ఎయు మాజీ విసి జి.నాగేశ్వరరావు, ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి రామారావు పాల్గొన్నారు.
సింహాచలం: అడివివరం జడ్‌పి.హైస్కూల్‌లో విద్యాకమిటీ సభ్యులు, విద్యార్థులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ వరంబాబు కమిటీ సభ్యులు నాయుడు, కల్పన, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బిఎన్‌ఆర్ భవనంలో టీచర్స్ డే
కంచరపాలెం : టీచర్స్‌డే సందర్భంగా కంచరపాలెం బిఎన్‌ఆర్ భవనంలో టైలరింగ్ శిక్షకురాలు పి సావిత్రిని శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, బిఎన్‌ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు సానబోయిన అప్పలరాజు, పెంటకోట రామారావు పాల్గొన్నారు.
ములగాడ : గంగానగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవంలో 59వ వార్డు వైసిపి అధ్యక్షుడు పుర్రె సురేష్‌యాదవ్ పాల్గొని, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేశారు, అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు కన్నబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కన అప్పారావు ఆధ్వర్యంలో వాసవి డెంటల్ సౌజన్యంతో చిన్నారులకు దంత పరీక్షలు నిర్వహించారు. టూత్‌బ్రష్, పేస్ట్‌లను అందజేశారు. హెచ్‌ఎం గంగాభవాని, షేక్ ఖాన్, నర్సింగరావు పాల్గొన్నారు.
మధురవాడ: మధురవాడ వాంబే కాలనీ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవంలో ముందుగా సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి హెచ్‌ఎం నీరజ పూలమాల వేసి, నివాళులర్పించారు. అయోధ్యనగర్ గ్లోబల్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. ఎలకవానిపాలెం విజయం స్కూల్‌లో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది.
పద్మనాభం : స్థానిక మండల పరిషత్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు బోని సన్యాసినాయుడు, తేర్నెడ్డి కృష్ణలతోపాటు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముదరగెడ్డ సన్యాసినాయుడు, చిరంజీవిరావులను ఎంపిపి కంటుభక్తు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలను అందించి, దుశ్శాలువాతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. వారి సేవలను మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపిపి రాంబాబు పిలుపునిచ్చారు.
భీమునిపట్నం : మూడో వార్డు, జివిఎంసిఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాథాకృష్ణన్ చిత్రపటానికి హెచ్‌ఎం చెట్టి సింహాచలం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి,విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నయీమ్ అన్సారీ, సుజాత కుమారి, ఎ శ్రీనివాసరావు, వెంకటరావు, మరగడ రామకృష్ణ,అశోక్, ఎం మురళీకృష్ణ, సిఆర్‌పి వంశీధర్ పాల్గొన్నారు.
ఒకటోవార్డు బంగ్లామెట్ట, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం రెడ్డిపల్లి అప్పల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కృష్ణంరాజుపేట ఎంపియుపి స్కూల్‌లో ఉపాధ్యాయులకు ఘనసన్మానం జరిగింది.
విశ్రాంత ఆర్మీ సుబేదార్‌కు ఘనసత్కారం
తగరపువలస : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్రాంత సుబేదారు ఎంఎఎన్ రెడ్డిని స్థానిక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమిలిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి ఎం సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ, వ్యక్తిత్వ వికాసం, వ్యాయామంలో ఎంతోమందికి ఉచితంగా శిక్షణనిచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో ఫాబ్ సభ్యులు డాక్టర్ లావణ్య, కాళ్ళ సన్నీ పాల్గొన్నారు.
పెందుర్తి : వేపగుంట ఉన్నత పాఠశాలలో జిల్లా అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎస్‌ఆర్.పురం ప్రాంతానికి చెందిన ఎం అనసూయ సీఎం జగన్మోహన్ నుంచి అవార్డు స్వీకరించడంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. నరవ విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో పలువురు ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ ఎంవికె శ్రీనివాస్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ దయాన సిబ్బంది పాల్గొన్నారు
సీతమ్మధార : 55వ వార్డు కంచరపాలెం గిరీషాస్ చైతన్య ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవంలో వైసిపి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు పాల్గొని, ఉపాధ్యాయులను సత్కరించారు. స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు జె.సోమేశేఖర్, ప్రిన్సిపల్ జె.అనురాధ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. 55వవార్డు కార్పొరేటర్ కెవిఎన్ శశికళ, కెపి.రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాస్, గంగామహేష్, యర్రంశెట్టి శ్రీనివాస్, వై.సిద్దార్థ, సొండి సురేష్, మధు,లక్ష్మి, శివారెడ్డి, అనురాధ, రవి, ధర్మేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ఆరిలోవ: 13వవార్డు, శ్రీకృష్ణాపురం ప్రభుత్వ పాఠశాలలో గురుపూజోత్సవంలో కార్పొరేటర్ కెల్ల సునీత పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్ధులకు యూనిఫాం దుస్తులు అందజేసారు. హెచ్‌ఎం దయానంద్, వైసిపి నేతలు పిల్లి వీర్రాజు, మారిక భాస్కర్‌రావు, పాండ్రింకి శ్రీను పాల్గొన్నారు.
12వ వార్డు వైసిపి అధ్యక్షుడు కన్నేటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆరిలోవ టిఐసి పాయింట్ వద్ద ఉపాధ్యాయ దినోత్సవంలో వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి రామన్ పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యార్ధులకు స్వీట్స్ పంచిపెట్టారు. వైసిపి రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్మదర్శి సత్తి మందారెడ్డి, నేతలు అర్జున్, మోహన్ పాల్గొన్నారు.
ఆనందపురం : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మండలాల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, డిఇఒ చంద్రకళ, జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, ఎంపిపిలు మజ్జి శారదా ప్రియాంక, గాడు వెంకటప్పడు, కంటుబుక్త రాంబాబు, వైస్ ఎంపిపి పాండ్రంగి శ్రీను, బోట్ట రామకృష్ణ నాయకులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, బంక సత్యనారాయణ, మజ్జి వెంకట్రావు, దాట్ల పెదబాబు, బిఆర్‌బి నాయుడు, కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు
వెల్లంకిలో వక్ష ఫౌండేషన్ అధ్యక్షులు కాకర సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. హెచ్‌ఎం బాబూలాల్, ప్రసాద్ మాస్టారు, వక్ష ఫౌండేషన్ ప్రతినిధులు సాడి శంకర్, కిరణ్, పూర్ణనాయుడు, ఉదరు పాల్గొన్నారు.
గురుపూజోత్సవానికి ఉపాధ్యాయులు దూరం
ఆనందపురం: సిపిఎస్ రద్దుపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న నిర్బంధం వైఖరి, అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా గురుపూజోత్సవానికి ఉపాధ్యాయులు దూరంగా ఉండడంతో ఈ వేడుక వెలవెలబోయింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యే ముత్తంశెట్టి, డిఇఒ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో టీచర్లు గైర్హాజరుతో వెలవెలబోగా, వేసిన కుర్చీలను సచివాలయ సిబ్బందితో భర్తీచేసి కార్యక్రమం తూతూమంత్రంగా అయిందనిపించారు.










