Oct 29,2023 23:45

రాజమహేంద్రవరంలో నిరసన తెలుపుతున్న ఆదిరెడ్డి వాసు తదితరులు

ప్రజాశక్తి- యంత్రాంగం
రాష్ట్రంలో జగనాసురుని కళ్లు తెరిపిద్దాం అంటూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌లో ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్యచౌదరి, సిటీలో రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. టిడిపి సిటీ ఆధ్వర్యంలో నగరంలోని జేఎన్‌ రోడ్డులో, రూరల్‌ టిడిపి ఆధ్వర్యంలో బొమ్మూరు గ్రామంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. టిడిపి రూరల్‌ మండల అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్‌ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీలో స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద శాసన సభ్యులు గోరంట్ల చంద్రబాబుకి మద్దతుగా నాయకులతో, కార్యకర్తలతో కళ్లకు గంతలు కట్టుకొని 'నిజం గెలవాలి' అని గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ ఆటవిక, అరాచక పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తి మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాజకీయ కక్షతోనే 50 రోజులుగా చంద్రబాబును జైళ్లో నిర్బంధించారన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ బాబుని జైల్లో నిర్బంధించిన ఆయన ఆలోచన అంతా రాష్ట్ర అభివృద్ధిపై, ప్రజల సంక్షేమంపైనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కామిని భాస్కర్‌రావు, పలివెల సత్యనారాయణ, పితాని రాజు, రాయుడు సునీల్‌, మరదపా రాంబాబు, నడిగట్ల కామేష్‌, శ్రీను, వాసంశెట్టి రాంబాబు, గొల్లు రామసత్యం, హరినాథ్‌ పాల్గొన్నారు.ఉండ్రాజవరంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు ఆదివారం 'జగనాసురునికి కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు అక్రమ రిమాండ్‌కు నిరసనలో భాగంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి కళ్లు తెరిపిద్దాం అంటూ కళ్లకు గంతలు కట్టుకుని, నిజం గెలవాలి అంటూ నినాదాలతో ఇళ్ల వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. సూర్యారావుపాలెంలో ఉప సర్పంచ్‌ నందిన శ్రీనివాస్‌, కాల్దారిలో ఇ.సత్యనారాయణ, కె.సుబ్బారావు, వేలివెన్నులో ఎ.సత్యనారాయణ, బి.శ్రీనివాస్‌, చివటంలో రమేష్‌, పాండురంగ, దత్తుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరవలి మండలం తీపర్రు గ్రామంలో కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ఆదివారం టిడిపి నియోజక వర్గ సీనియర్‌ నాయకులు కుందుల వీరవెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాం అంటూ చేపట్టిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు హాజరై మద్దతు తలెఇపారు. జనసేన నాయకులు ప్రత్తిపాటి ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ భోగవల్లి వెంకట సత్యనారాయణ, కంటిపూడి రామకృష్ణ, ఎస్‌కె.కుమార్‌, ఈతకోట సత్యనారాయణ, అనపర్తి వెంకటనారాయణ, టిడిపి ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి వెంకటరమణ, దేవరపల్లి భాస్కరరావు, కోడూరి శ్రీరాములు, అక్కిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలంలోని పలుగ్రామాల్లో టిడిపి శ్రేణులు కళ్లకు గంతులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశాయి. అన్నదేవరపేటలో జరిగిన కార్యక్రమంలో యువగళం జిల్లా నాయకులు కాకర్ల సత్యేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి.భరత్‌, కె.జగన్‌, నరేంద్ర, విజరు, వినోద్‌, శివ తదితరులు పాల్గొన్నారు. పోచవరంలో అనపర్తి ప్రసాద్‌, బల్లిపాడులో వై.మణికంఠ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ అధ్యక్షులు సుంకర దుర్గారావు, నాయకులు నందిగం బుల్లిరాజు, యాగంటి సాయి, కె.రవికుమార్‌, చింతల వెంకటేష్‌, ఇ.బుజ్జి పాల్గొన్నారు.